*బాలుర సంక్షేమ వసతి గృహం లలో వైద్య శిబిరం*
*జమ్మికుంట జూన్ 28 ప్రశ్న ఆయుధం*
శనివారం రోజున వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల బాలుర సంక్షేమ వసతి గృహం లలో డాక్టర్ చందన ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న 18 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అనంతరం వసతి గృహం లలోని బాలురకు డాక్టర్ చందన హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గుణ్య, మెదడు వాపు టైఫాయిడు జాండిస్ మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను చేతుల పరిశుభ్రత గురించి హ్యాండ్ వాష్ చేసే పద్ధతులు గురించి తెలిపారు బయటి తిను బండారాల జోలికి వెళ్ళవద్దని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించినారు.
ఈ కార్యక్రమములో డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటరు మోహన్ రెడ్డి, సూపర్ వైజర్ రత్నకుమారి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రవీణ్, హెల్త్ అసిస్టెంట్ నరేందర్,ఏఎన్ఎం సాజిదా పర్వీన్ ఆశా కార్యకర్త లక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు