టీఎస్ పీఆర్ టీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో శనివారం టీఎస్ పీఆర్ టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పీఆర్ టీయూ ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు పెద్దాపూర్, నందికంది, గొల్లగూడెం, సిద్దాపూర్, రేజింతల్, కంబాలపల్లి, చందాపూర్, ఆత్మకూరు, ఏటిగడ్డసంగం, కొల్కోర్ తదితర పాఠశాలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్యహించారు. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అడిగిన సందేహాలను మదన్ గోపాల్ నివృత్తి చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మధన్ గోపాల్ ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించి ఏ సమస్యలైనా పరిష్కరించే ఉపాధ్యాయ సంఘం ఒక్క పీఆర్ టీయూ సంఘమేనని అన్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ పూర్తి చేయించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సీ.పీ.ఎస్ విధానాన్ని రద్దు పరుస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపు చేయుట, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లును మంజూరు చేయుటం, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయించడం, మెరుగైన పీ.ఆర్.సీ,నూతన హెల్త్ స్కీమ్ రూపొందించడం, ఎయిడెడ్ మోడల్ స్కూల్ గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించడం, కేజీబీవీతో పాటు సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ వారి రెగ్యులర్ చేయించుట, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలో పారిశుద్ధ్య కార్మిక నియామకం మరియు ఉచిత విద్యుత్ ఉత్తర్వులు సాధించుటo, జీవో నెంబర్ 11, 12 లను సవరించి బీఈడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులను పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతిని కల్పించుట వంటి సమస్యలను సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు దయానంద్, లక్ష్మయ్య, రమేష్,కరా ముతుల్లా,ప్రభాకర్ రెడ్డి,అక్బర్, వెంకటేశం, గోవిందరావు, ప్రవీణ్, రామిరెడ్డి, శ్రీనివాస్ రావు,శ్రీకాంత్, తాజుద్దీన్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now