సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాయి కోడ్ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా జొన్నలు రవి సీజన్లో సాగు చేస్తారని జొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర అందించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3371కి కొనుగోలు కేంద్రాలలో జొన్నలను కొనుగోలు చేయునట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంత రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తమ జొన్నలను విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నాలాచెరు కచూర్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఆర్డీవో రామిరెడ్డి, ఏడిఎ సత్యనారాయణ, ఎంపీడీవో షరీఫ్, ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
రాయికోడ్ లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published On: April 18, 2025 9:13 pm
