సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో మంత్రి దామోదర రాజనర్సింహా విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ ను కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ హాస్టల్స్ లలో ఉండే పిల్లలకు డైట్ చార్జీలను పెంచామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న అన్ని హాస్టల్స్ లలో పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు మేస్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అధికారి జగదీష్, ఆర్డీవో రాంరెడ్డి, ఎంపీడీవో, తహసిల్దార్, సంక్షేమ హాస్టల్ వార్డెన్ లు పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహా
Published On: November 8, 2024 7:20 pm