వర్షాలపై మంత్రి జూపల్లి సమీక్ష
వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆసిఫాబాద్ , ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి? జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఒకవేళ అధిక వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మరోవైపు రైతులకు యూరియా సరఫరా ఎలా చేస్తున్నారు? కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపు ల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.