సంగారెడ్డి, డిసెంబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): క్రిస్మస్ పండుగ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్రైస్తవ సోదర, సోదరీమణులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సేవ భావాలను సమాజానికి అందిస్తుందన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో స్ఫూర్తిగా నిలవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐక్యతతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింత సాయినాథ్, వెంకటేశ్వర్లు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
Published On: December 24, 2025 7:55 pm