బడే మసీదు వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం మార్చి 18: కూకట్‌పల్లి ప్రతినిధి
ఓల్డ్ బోయిన్పల్లి లోని బడే మసీదు వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, శంబిపూర్ రాజు కార్పొరేటర్లు నరసింహ యాదవ్ ,జూపల్లి సత్యనారాయణ ,సబియా గౌసుద్దీన్, పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్లు బాబురావు, తూము శ్రవణ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు కటిక ఉపవాస దీక్షలు ఉండి అల్లాహ్ ను స్మరించుకుంటూ ఈ విధంగా ఇఫ్తార్ విందు చేసుకోవడం ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అల్లా దయతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.