సంగారెడ్డి/మెదక్, మార్చి 17 (ప్రశ్న ఆయుధం న్యూస్):గుమ్మడిదల మండలం ప్యారా నగర్‌లో నిర్మాణంలో ఉన్న డంపింగ్ యార్డు పనులను తక్షణం నిలిపి వేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. సోమవారం ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ డంపింగ్ యార్డు వ్యవహారంపై ఇప్పటికే స్థానిక రైతులు కోర్టును కూడా ఆశ్రయించారని, కోర్టు స్టే ఇచ్చినా, రాత్రికి రాత్రి పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాల మధ్యలో ప్రభుత్వం 152 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉందని చెప్తున్నా.. అక్కడ అడవి భూమి మాత్రమే ఉందని అన్నారు. అక్కడ ప్రభుత్వ భూమి లేదని సర్వే చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డు వల్ల నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు మూడు మండలాల ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకుని పనులను నిలిపి వేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డుపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి
Published On: March 17, 2025 2:02 pm
