మెదక్/నర్సాపూర్, సెప్టెంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విగ్నేశ్వర కాలనీ, ఎన్ జీఓఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాధుని మండపంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ లు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పంబాల రామచంద్ర, పట్టణ అధ్యక్షులు పంబల బిక్షపతి, బాల్ రెడ్డి, నాగేష్, నాయకులు సత్యంగౌడ్, మొహమ్మద్, షరీఫ్ షేక్ హుస్సేన్, ఫైజాన్ సైఫ్ ఆ, కాలనీ వాసులు పాల్గొన్నారు.
వినాయక మండపంలో పూజలు చేసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి
Published On: September 12, 2024 7:55 pm
