మెట్రోలో ప్రయాణించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెట్రోలో ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి ప్రయాణించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్ వరకు ఎమ్మెల్సీ ప్రయాణించారు. అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి రోజు ఎక్కువ సమయం వరకు మెట్రో రైలు నడపడంతో పాటు వచ్చే ప్రయాణికులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. ఈ మేరకు మెట్రోలో ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలపై సౌకర్యాలను ఎమ్మెల్సీ అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమైన వారితో మెట్రోలో కాసేపు సరదాగా గడిపారు. పిల్లల మధ్యలో కూర్చొని వారితో ముచ్చటించారు. అనంతరం ప్రజల సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మెట్రో అఫిషియల్ కు సూచించారు. ప్రధాని మోదీ చొరవతో హైదరాబాద్ లో చాలా ప్రాంతాలకు మెట్రో సేవలు అందుతున్నాయని, దీంతో ప్రయాణికులకు సులభంగా, తక్కువ టైంలో మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు. వీరి వెంట నాయకులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment