కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు అభివృద్ధి మంత్రి కిషన్ రెడ్డిని ఉమ్మడి మెదక్, నిజాంబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డిలు కలిశారు. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో కుటుంబ సమేతంగా కలిసిన సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి తమ కుమారుడు అనీష్ రెడ్డి – మహీ వివాహం ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న సందర్భంగా ఆహ్వాన పత్రికను మంత్రి గారికి అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనీష్ రెడ్డి దంపతులకు ముందస్తుగా ఆశీర్వచనాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment