తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం

తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం

హెల్త్ సూపర్వైజర్ శ్యామల ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం

గురువారం రోజున ఇల్లందకుంట మండలంలోని లక్ష్మన్నపల్లి అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లి వాళ్ళ ప్రాముఖ్యత గురించి హెల్త్ సూపర్వైజర్ శ్యామల ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరమని తల్లి పాలు బిడ్డకి సంజీవని లాంటివని అమృత తుల్యమైన ఆహారమని పేర్కొన్నారు చంటి పిల్లలకి మురిపాలు అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయని ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలను మాత్రమే ఇవ్వాలని, అ తర్వాత అనుబంధ ఆహారం ఇస్తూ తల్లి పాలను రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వాలని తల్లులకు గర్భవతులకు అవగాహన కల్పించినారు. తల్లి పాలలో అనేక రకాల పోషకాలు వుంటాయి.తల్లి పాల వలన బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని న్యూమోనియా నీళ్ల విరోచనాలు,ఉబకాయం, అలర్జీలు రాకుండా కాపాడుతాయి తల్లి బిడ్డల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగు తుందని తల్లులకు తెలియపరిచినారు. అదేవిధంగా తల్లులకు గర్భశాయ రొమ్ము క్యాన్సర్లు రాకుండా కాపాడుతుందని తల్లులలో మధుమేహం, అధిక బరువు, మానసిక ఒత్తిడి రాకుండా పనిచేస్తుందని వెంటనే గర్భం రాకుండా తాత్కాలిక కుటుంబ నియంత్రణ విధానంగా పని చేస్తుందని తెలిపారు అంగన్వాడీ టీచర్స్ సంగీత అలివేలు, ప్రభలత ఏఎన్ఎం రోజా రాణి తల్లులు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment