మెదక్/నర్సాపూర్, జనవరి 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవాని వెడ్డింగ్ మాల్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. గురువారం నాడు నర్సాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవాని వెడ్డింగ్ మాల్ ను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీ రఘునందన్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ యాదవ్, బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, బీజేపీ అసెంబ్లీ మాజీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, కౌన్సిలర్లు బుచ్చేష్ యాదవ్, గోడ రాజేందర్, రమేష్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.