టీజేయూరాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు నివాసంలో ఎంపీ ఈటెల
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆత్మీయంగా భేటీ
పత్రికారంగం, రాష్ట్ర రాజకీయాలపై చర్చ
జర్నలిస్టులు సమాజానికి అద్దమంటూ ఈటెల వ్యాఖ్య
ఎల్లప్పుడూ మీడియా పక్షాననే భరోసా
టీజేయూ నాయకులు, బిజెపి నేతలు సమావేశంలో పాల్గొన్నారు
ప్రశ్న ఆయుధం హైదరాబాద్, ఆగస్టు 29:
టెలంగాణ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు నివాసానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం ప్రత్యేకంగా వెళ్లారు. కప్పర ప్రసాద్ రావు కుటుంబంతో ఆత్మీయంగా మమేకమైన ఈటెల, పత్రికారంగం, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
జర్నలిస్టులు సమాజానికి అద్దంలాంటి వారు, ప్రజల తరఫున ఎల్లప్పుడూ నిజాన్ని వెలుగులోకి తెస్తారని అభినందించిన ఆయన, మీడియా పక్షాన ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో టీజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, బిజెపి జిల్లా అధ్యక్షులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.