నా పోరాటం మొత్తం న్యాయం వైపే :మందకృష్ణ మాదిగ

నా పోరాటం మొత్తం న్యాయం వైపే :మందకృష్ణ మాదిగ

IMG 20250207 WA0102 scaled

30 ఏళ్ల పోరాటంలో టీజేయు భాగమయింది

కెసిఆర్ ఉద్యమాన్ని అవమానిస్తే

రేవంత్ రెడ్డి ఉద్యమాన్ని అవహేళన చేశాడు

నరేంద్ర మోడీ గుండెల్లో పెట్టుకున్నాడు

హైదరాబాద్ :

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాల్గొని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తన 30 ఏళ్ల పోరాటంలో ప్రతి చోట టీజేయు తనతో పాటే నడిచిందన్నారు జర్నలిస్టులో చిన్నోళ్ల పెద్దోళ్ళని కాదు న్యాయం వైపు ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు న్యాయం వైపు పోరాటాలు చేస్తున్నారని అన్నారు. తన 30ఏళ్ల పోరాటంలో జాతి కోసం కొన్ని రోజులు కష్టపడితే సమాజంలో జరిగే అనేక కష్టనష్టాల మీద పోరాటం చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్ కు ఉన్నదని అన్నారు ఆరోగ్యశ్రీ వికలాంగులకు పెన్షన్ ఒంటరి మహిళలకు పెన్షన్ రావడంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం కీలకపాత్ర పోషించిందని అన్నారు సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తమ ఉద్యమాన్ని గుర్తించి గుండెలకు హత్తుకున్న నరేంద్ర మోడీ నీ ఉద్యమానికి అడుగడుగున బాసటగా నిలిచిన సమాజానికి తాను రుణపడి ఉంటాను అన్నారు, నిండు అసెంబ్లీలో కెసిఆర్ ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణగ తొక్కుతా అని అవమానిస్తే 40 నిమిషాల ప్రసంగం రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ పేరు తీయకుండా అవమానించారన్నారు ఎన్నో ఏండ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్ర మోడీ గుర్తించి గుండెలకు హత్తుకుని హృదయంలో పెట్టుకున్నారన్నారు భవిష్యత్తులో ఎవరికి మద్దతు తెలిపాలనో మీరే చెప్పాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సమాజంలో జరిగే అనేక అంశాల మీద పోరాటం చేస్తుందని మందకృష్ణ మాదిగ ప్రతి అడుగుజాడల్లో మా పాత్ర ఉందని గద్దర్ తెలంగాణ ఉద్యమంలో అనేక చోట్ల వేదిక అయ్యామన్నారు బహుజన బతుకమ్మ మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది తామే అన్నారు జర్నలిస్టుల సమస్యలపై ఏ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని ఇప్పటికైనా తెలంగాణను తీసుకువచ్చిన జర్నలిస్టులకు గుర్తింపుని ఇవ్వాలన్నారు. మాజీ ఎంపీ నేతకాని వెంకటేష్ జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో ఉందని నాలుగో స్తంభం గా ఉన్న జర్నలిస్టును ప్రభుత్వం ఆదుకోవాలని న్యాయం వైపు ఉన్న జర్నలిస్టులకు కష్టాలు అధికంగా ఎస్ కుమార్ బిజెపి జాతీయ దళిత మోర్చా కార్యదర్శి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో అత్యంత దీనస్థితిలో ఉన్నారని ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ నాలుక గీసుకోవడానికి పని చేయదు అన్నారు అక్రిడేషన్ అంటే జర్నలిస్టుకు హెల్త్ భరోసా ఉండాలని పిల్లలకు విద్యా భరోసా ఉన్న కార్డులు ఇవ్వాలని ఎందుకు పనికిరాని కార్డులు ఇవ్వడం దండగ అన్నారు. ఇన్వెస్టిగేటెడ్ , హమానిటీ జర్నలిస్టులు మూడుపూటల తిండి లేక పస్తు పస్తులుండే పరిస్థితి ఏర్పడదన్నన్నారు. సొంత అవసరాల కోసం పార్టీలకు ఒకరుగా జర్నలిస్టులు సంఘాలు విడిపోయి పనిచేస్తున్నారన్నారు. నేషనల్ లిస్టు హాబ్ చైర్మన్ సాయి కృష్ణ మాట్లాడుతూ ఆయన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా న్యాయం వైపే పోరాటం చేస్తూ వస్తున్న ఏకైక యూనియన్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు. సమాజంలో అనగదొక్కబడ్డ కులం నుండి పద్మశ్రీ వరకు సాగిన మందకృష్ణ ప్రయాణం పలువురికి ఆదర్శంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ గండే పిట్ట శ్రీనివాస్ రెడ్డి ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ఉపాధ్యక్షులు దాసన్న కార్యదర్శులు చింతల కృష్ణ , బాపురావు, మారేపల్లి కృష్ణ, కనకా రెడ్డి, జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య దేవులపల్లి అశోక్, ప్రసాద్, షానూర్ బాబా రామయ్య దిలీప్ ప్రసాద్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, సునీత కృష్ణమూర్తి శ్రీకాంత్ చారీ, శ్రీనివాస్,గోపాల్, సంతోష్, ఆకుల సంజీవ్,రాజు, సత్యం, రాజేందర్ రావు , శరత్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now