దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు: నాగారం కాంగ్రెస్ నాయకుల నివాళులు

*దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు: నాగారం కాంగ్రెస్ నాయకుల నివాళులు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 4

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు సత్యనారాయణ కాలనీలో శుక్రవారం రోజు నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణపురం కొండల్ రెడ్డి, మాదిరెడ్డి రాజిరెడ్డి పాల్గొనగా, నాగారం కురుమ సంఘం నాయకులు కూడా విశేషంగా హాజరయ్యారు.

విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న దొడ్డి కొమరయ్య బలిదానం అమూల్యమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన సేవలకు స్మరణే నిజమైన నివాళి అంటూ కార్యక్రమం ముగిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment