క్రీడల్లో ప్రతిభ కనపర్చిన ఆల్ఫోర్స్ విద్యార్థులను అభినందించిన నరేందర్ రెడ్డి

*ఎస్ జి ఎఫ్ క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అభినందన*

*కరీంనగర్ అక్టోబర్20 ప్రశ్న ఆయుధం*

ప్రపంచ క్రీడల్లో క్రికెట్కు ప్రత్యేక స్థానం ఉన్నదని చాలా మంది క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు యన్.జి.ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ చాటి ప్రశంస పత్రాలు సాధించిన ఏర్పాటు చేసినటు వంటి ప్రత్యేక అభినందన సభకుహాజరై మాట్లాడుతూ యస్.జి.ఎఫ్ వారు పలు టోర్నమెంట్ల నిర్వహణ చూడడమే కాకుండా వారిని సరైన పద్దతిలో అమలుపర్చేలా పలు నియమనిభందనలు తెలుపుతోందని చెప్పారు. మన రాష్ట్రంలో యస్.జి.ఎఫ్ ఆదేశించిన ప్రకారం నిర్దేశించిన సమయంలో ఆడాలని ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలో నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వారిని వివిధ స్థాయిలో నిర్వహించబడే పలు క్రీడా పోటీలకు ఎంపిక చేయడమే కాకుండా కావల్సిన సమయంతో పాటు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now