Site icon PRASHNA AYUDHAM

26 ఏళ్ల తర్వాత ఢిల్లీ చరిత్ర తిరగరాసిన నరేంద్ర మోడీ!

IMG 20250208 WA0087

*26 ఏళ్ల తర్వాత ఢిల్లీ చరిత్ర తిరగరాసిన నరేంద్ర మోడీ!*

*న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 08*

ఢిల్లీ ఎన్నికల ఫలితాల మధ్య బిజెపి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో బీజేపీ ఢిల్లీకి వస్తుంది అనే కొత్త పోస్టర్ ను షేర్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు.

తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ 23 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ APP అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పని చేసింది. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ కి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభిచింది. మరోవైపు ఆమ్‌ఆద్మీ,

కాంగ్రెస్ పార్టీ లు విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభ పడిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రా యాలను వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version