పోలీసు సేవల క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ లో రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నర్సాపూర్: జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి

మెదక్, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీసు సేవల క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ లో అన్ని జిల్లాల్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపికైందని, రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నర్సాపూర్ ఎంపికైనట్లు జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల పని తీరు, పోలీసులపై ప్రజలలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ జనవరి 9న క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ ను రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదగా ఆవిష్కరించారు. జనవరి నుండి ఇప్పటి వరకు ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అన్ని జిల్లాలకు ర్యాంక్ ను పొందు పరచడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలో మెదక్ జిల్లా మొదటి స్థానం ఎంపీక కావడం అభినందనీయమని అన్నారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీజీపీ చేతుల మీదగా సర్టిఫికెట్ ను అందుకోవడం జరిగిందని తెలిపారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో రాష్ట్రంలోనే 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ లో మెదక్ జిల్లాకు చెందిన రెండు పోలీస్ స్టేషన్లు ఉండడం మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలకు నిదర్శనమని అన్నారు. అందులో నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు ఒకటవ స్థానం, తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు 4వ స్థానం పొందాయని తెలిపారు. ఆయా పోలీస్ స్టేషనులకు చెందిన ఎస్హెచ్ ఓలు, నర్సాపూర్ ఎస్ఐ లింగం, తూప్రాన్ ఎస్ఐ శివానందంలు సర్టిఫికెట్లను డీజీపీ జితేందర్ చేతుల మీదగా అందుకున్నారని చెప్పారు. అదే విధంగా ఫోక్సో కేసులలో ఐఓగా ఉండి 60 రోజుల లోపే ఎక్కువగా చార్జ్ షీట్లను వేసినందుకు గాను తూప్రాన్ డీస్పీ వెంకట్ రెడ్డికి రాష్ట్రంలోనే రెండో స్థానం పొంది అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ ను అందుకున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment