ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు
ప్రశ్న ఆయుధం 21 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )
జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి 83వ జన్మదిన వేడుకలు బాన్సువాడ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ…కింది స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అధిరోహించడం అనేది మామూలు విషయం కాదు.ఇది ఎంతో సాధన, పట్టుదల, ప్రజాప్రేమకు నిదర్శనం. ఖర్గే ఒక అణగారిన వర్గానికి చెందినవారు కావడం,ఆయన ఎదుగుదల వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూనే ఉంది” అని పేర్కొన్నారు.జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు కేక్ కట్ చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, కార్యక్రమాలు జరిపారు.పార్టీ కార్యకర్తలంతా ఏకతాటిపై నడిచి పార్టీ బలోపేతానికి ఖర్గే గారి నాయకత్వం లో కృషి చేయాలని నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్వాల కృష్ణా రెడ్డి,జంగం గంగాధర్, ఖలేక్ , ఎజాజ్,మోహన్ నాయక్,గోపాల్ రెడ్డి,వాహబ్,బాబా అలిమొద్దీన్,మొహమ్మద్ గౌస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.