సంగారెడ్డి, అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నవ తెలంగాణ పత్రిక మెదక్ జిల్లా డెస్క్ ఇంచార్జి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అకాల మరణం జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. అనిల్ కుమార్ అందరితో కలుపుగోలుగా మెలిచే వ్యక్తిగా పేరుపొందారు. ఆయన మరణం తీరని లోటు అని సహచరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్రికా మిత్రులు, సహచరులు, సీనియర్ జర్నలిస్టులు అనిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశారు. అనిల్ మృతికి పత్రికా సహచరులు నివాళులు అర్పించారు.
నవ తెలంగాణ మెదక్ డెస్క్ ఇంచార్జి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతి
Published On: October 16, 2025 9:13 pm