స్వామి వివేకానందకు ఎన్.బి.ఎం.ఐ ఘన నివాళులు: యువతకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపు

*స్వామి వివేకానందకు ఎన్.బి.ఎం.ఐ ఘన నివాళులు: యువతకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపు*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జులై 4

స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా నేషనల్ బంజారా మిషన్ ఇండియా (ఎన్.బి.ఎం.ఐ) స్థానిక కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఎన్.బి.ఎం.ఐ అధ్యక్షులు రవి రాజ్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై, వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా రవి రాజ్ రాథోడ్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆలోచనలు, ఉపన్యాసాలు యువతను ప్రేరేపించే శక్తిని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. “ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడం ద్వారా నేటి యువత సేవా దృక్పథంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చు. మన యువత ఆయన చూపిన ధార్మికత, సేవా మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది” అని ఆకాంక్షించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మురళి నాయక్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద కేవలం దేహధారి కాదని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని జనాల్లో రగిలించిన మహానుభావుడని కొనియాడారు. యువతకు ఉత్తమ మార్గదర్శకులైన ఆయన సందేశాలను అనుసరించడం ద్వారా దేశాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. నేటి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎదగాలంటే, స్వామీజీ చూపిన విధానంలో తమను తాము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో జరుపలా హరి హరి నాయక్, రమేష్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment