విశ్వశాంతి కోసం పాదయాత్ర చేపట్టడం అభినందనీయం: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహాత్మ బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయమని ఆ మహాత్ముడు చూపిన సన్మార్గంలో వీరశైవులు పయనిస్తూ లోక కళ్యాణం కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం పటాన్ చెరు వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం పటాన్ చెరు ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయానికి నిర్వహిస్తున్న పాదయాత్రకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వశాంతికి వీరశైవ లింగాయత్ లు గత 18 సంవత్సరాలుగా పాదయాత్రను చేపట్టడం అభినందనీయమన్నారు. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను వ్యతిరేకించి సమ సమాజం కోసం పోరాడిన అభ్యుదయ వాది మహాత్మా బసవేశ్వరునీ అడుగుజాడలలో నడుస్తూ ఆయన బోధించిన ప్రవచనాలను పాటిస్తూ వీరశైవ లింగాయత్ లు సమ సమాజ స్థాపనకు కృషి చేస్తున్నారని కొనియాడారు. సమాజ హితం కోసం పాటుపడే వీర శైవ లింగాయత్ లకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వీరశైవ లింగాయత్ ల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే లింగాయత్ లను ఓసీ నుంచి బీసీ లకు మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో లింగాయత్ ల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ నాయకులు, పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఐఎన్ టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, నాయకులు జలిగారి ఎట్టయ్య, పట్లోళ్ల ఆదిత్య రెడ్డి, రవి, దేవరాజ్, సాయి, అశోక్, ప్రవీణ్, అనిల్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment