కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ గాయత్రీ నగర్ లోని శ్రీ కనకదుర్గ నాగదేవత సహిత పోచమ్మ దేవాలయ అభివృద్ధికి జనసేన పార్టీ కూకట్పల్లి ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తన మద్దతు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ కోసం గ్రానైట్ ను అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
జనసేన పార్టీ కూకట్పల్లి ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దేవాలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన గ్రానైట్ ను అందిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసమే తన బలం అని, దేవాలయాల అభివృద్ధి తన బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని తెలిపారు.
ఆలయ కమిటీ చైర్మన్ పులిగోల్ల శ్రీనివాస్ యాదవ్, ప్రెసిడెంట్ కాయితి యాదవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కల్వల ఏడుకొండలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన నాయకులు, మహిళలు, భక్తులు కూడా పాల్గొన్నారు.











