ఆర్మూర్ పట్టణంలో మంగళవారం హోళీ పండుగను ఐక్యమత్యంతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాలనీ అంతా రంగుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది.
ఒకరోజు ముందుగా జరిగిన కామదహన కార్యక్రమంలో పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని ఆచారాలను భక్తితో నిర్వహించారు. మరుసటి రోజు, రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
చిన్నారులు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని, రంగులతో ఆడుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ సందర్భంగా పట్టణంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలలో భరత్, రాజేష్, రవి, సంతోష్, రమణ, పూర్ణచందర్, సుధీర్, గంగాధర్, నవీన్ తో పాటు పలువురు స్థానికులు పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఇది సంఘీభావానికి, సంతోషానికి ప్రతీకగా నిలిచింది.

