కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టే లక్ష్యంతో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రచార రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని డీఎల్ఎస్ఏ కార్యదర్శి టి. నాగరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సమాజంలో బాల్య వివాహాల నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని డీఎల్ఎస్ఏ కార్యదర్శి టి. నాగరాణి అన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారానే వాటిని సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆమె తెలిపారు.
‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్’ ఆధ్వర్యంలో, లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ప్రచార రథయాత్ర, బాల్య వివాహాల నిర్మూలన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.
ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, డీసీపీవో స్రవంతి, సాధన సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ రథయాత్ర పాల్వంచ, మాచారెడ్డి, భిక్నూర్, సదాశివనగర్ మండలాల్లోని గ్రామాల్లో కొనసాగుతుంది.
ఈ కార్యక్రమం సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టినదని, దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నాగరాణి అభిప్రాయపడ్డారు.


