అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భద్రాచలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సమాజ సేవలో నిమగ్నమైన పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో, సమాజంలో తమ వంతు సేవ అందిస్తున్న న్యాయవాది సంధ్య, ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు, మరియు కళ్యాణ కట్ట వద్ద సేవలందిస్తున్న ఐదుగురు మహిళలకు బీఆర్ఎస్ నాయకులు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
మహిళల సేవలను గుర్తించి, వారిని గౌరవించుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. మహిళలు సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమానికి పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మన్ననలను పొందింది.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులలో కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, ప్రియాంక మాజీ, మాజీ ఎంపీపీ శాంతమ్మ, తెల్లం కామేశ్వరి, రమాదేవి, భవాని, కుమారి, రమణ తదితరులు ఉన్నారు.

