భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా, రాయలసీమ జోనల్ సమీక్ష సమావేశం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో జోనల్ పరిధిలోని పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రంగోలి గోపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమీక్షకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కాపు రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ కూడా పాల్గొన్నారు.
సమావేశంలో జోనల్ పరిధిలోని రాష్ట్ర పదాధికారులు, జోనల్, జిల్లా ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాబోయే కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, జోనల్ ఇన్చార్జ్ ఎం. బంగారయ్య, రాష్ట్ర ట్రెజర్ రాందాస్, సత్య సాయి జిల్లా అధ్యక్షుడు అనిల్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో ఓబీసీ మోర్చా కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలతో అనుసంధానం పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.











