నిజామాబాద్, జూలై 6
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ప్రతి రెండు డివిజన్లకు ఒక సూపర్వైజర్ను, నియోజకవర్గ స్థాయిలో ఈఆర్వో (ERO) కోఆర్డినేటర్‌ను నియమించాలని నిర్ణయించింది.
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ప్రతి రెండు డివిజన్లకు ఒక సూపర్వైజర్ను, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఈఆర్వో (ERO) కోఆర్డినేటర్‌ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు.
సోమవారం నిజామాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సూపర్వైజర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 301 పోలింగ్ బూత్‌లకు కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను నియమించినట్లు తెలిపారు. ప్రతి రెండు డివిజన్లకు ఒక సూపర్వైజర్ చొప్పున బాధ్యతలు అప్పగిస్తూ, సుమారు పది బూత్‌ల పర్యవేక్షణ బాధ్యతలను వారికి అప్పగించనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చూడటంతో పాటు, వాటిని ఎలా నింపాలో ప్రజలకు వివరించాలని, ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సహాయం అందించాలని ఆయన కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సూపర్వైజర్లు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల హక్కులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ ఉపాధ్యక్షులు విజయపాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ, జెండాగుడి చైర్మన్ ప్రమోద్, ప్రధాన కార్యదర్శులు ధర్మారం అవీన్, జిల్లెల రమేష్, సర్దార్ నరేంద్ర సింగ్, హర్షద్, అధికార ప్రతినిధి గోవర్ధన్, జియా, సీనియర్ నాయకుడు ఉబేద్ బిన్ హందన్, కార్యదర్శులు శోభన్, వెంకటేష్, అబ్దుల్ వహీద్, బంటు బలరాం, శ్రీశైలం, ముస్తఫా ఆల్కఫ్, చరణ్, అపర్ణ, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.












