నిజామాబాద్, 2026-07-12
ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలోని 14వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వయంగా నింపి, బీఎల్ఓ పద్మకు అందజేశారు.
ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలోని 14వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా తనకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వయంగా నింపి, బీఎల్ఓ పద్మకు అందజేశారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం 14వ డివిజన్లోని వివిధ పోలింగ్ బూత్‌లను సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. సతీష్‌నగర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
భగత్‌సింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే టైలరింగ్ శిక్షణ పూర్తిచేసి ప్రభుత్వ సహకారంతో కుట్టు మిషన్లకు ఎంపికైన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ అబ్దుల్ వాహిద్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బసవ సాయి, రాజు, 14వ డివిజన్ నాయకులు షకీల్, ముజాహిద్, మౌనిక, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.











