కామారెడ్డి జిల్లా మద్నూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, వేసవి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలను ఎవరికీ చెప్పరాదని పోలీసులు సూచించారు.
మద్నూర్ ఎస్బీఐలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు మద్నూర్ సబ్ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం అవగాహన కల్పించింది. సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు.
బ్యాంకు అధికారులు లేదా పోలీసులు ఎప్పుడూ ఓటీపీలు అడగరని, వీటిని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–100కు సమాచారం అందించాలని సూచనలు చేశారు.
రోడ్డు భద్రతపై కూడా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.
పోలీస్ కళాబృందం సభ్యులు పాటలు, ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.








