కామారెడ్డి, జూలై 24
కామారెడ్డి జిల్లాలో జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జనగణన సంచాలకుల కార్యాలయం సంయుక్త సంచాలకులు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. హ్యాండ్‌బుక్ రూపకల్పనలో ఖచ్చితత్వం, నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్–డీసీహెచ్‌బీ) తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జనగణన సంచాలకుల కార్యాలయం, హైదరాబాద్‌కు చెందిన సంయుక్త సంచాలకులు జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనలో ఖచ్చితత్వం, నాణ్యత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శిక్షణలో అందించే మార్గదర్శకాలను క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని, సమాచార సేకరణ, డేటా నమోదు తదితర ప్రక్రియలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో జనగణన సంచాలకుల కార్యాలయం అధికారులు డి.వి. రమణ, రాజేశ్వర్, సీపీఓ రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.










