బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామాహరెడ్డిలోని IDOCలో తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (LB) శ్రీ మధు మోహన్ పాల్గొని, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురయ్య భూమి, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం పోరాడి అమరుడైన మహా వీరుడని, ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా ఈ సందర్భంగా తమ అమరవీరుడి సేవలను స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీ చక్రధర్, పలువురు బహుజన, కుర్మ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











