కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని వక్తలు పిలుపునిచ్చారు.
WWord మరియు DLCA జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి రాణి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన దుష్పరిణామాలను వివరించారు. ఇది వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు దేశాభివృద్ధికి హానికరం అని ఆమె తెలిపారు. యువత విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జయకుమారి, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులను కోరారు. యాంటీ డ్రగ్ కన్వీనర్ శ్రీ నాగేశ్వరయ్య మాదకద్రవ్యాల నివారణలో అందరి భాగస్వామ్యాన్ని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఫణికుమార్, ప్రమీల, సంతోష్ రెడ్డి, పద్మ, విజయ, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.











