కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గాంధారి ఎమ్మార్వో రేణుకా చౌహన్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బీస గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లైని రమేశ్, సంగని బాబు, ఎండి మదార్ భాయ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోమ్మని బాలు, మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు, గడ్డ శంకర్, మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ద్వారా పేదల వివాహాలు సులభంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











