కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస స్వామి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, వారి శక్తి, సామర్థ్యాలు, విజయాలను విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సి.ఆర్. అన్నపూర్ణ, జె. కవిత, సి.హెచ్. ఆంజనేయులు, రమేష్, ఏఎన్ఎం దేవయ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఉత్సాహంగా జరిగాయి. మహిళల సాధికారత, సమానత్వం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సామాజిక స్పృహను పెంచడానికి దోహదపడతాయని కళాశాల యాజమాన్యం అభిప్రాయపడింది.

