సంగారెడ్డి జిల్లా హత్నూరలో పారిశుధ్య కార్మికులపై తేనెటీగలు దాడి చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.
పారిశుధ్య కార్మికులు వాటర్ ట్యాంకు వద్ద పైపు లైన్ లీకేజీ మరమ్మత్తులు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
తేనెటీగల దాడి జరుగుతుండగా, కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
స్థానిక సర్పంచ్ ఎల్లయ్య మరియు ఇతర నాయకులు వెంటనే బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనపై గ్రామ పంచాయతీ కార్యదర్శి మజార్ నిర్లక్ష్యం వహించడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.











