పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరు ఖాన్ బజార్ లో బుధవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు పరారయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదిల్ ఖాన్ అనే వ్యక్తి తన సోదరుడు అఖ్వీల్ ఖాన్, అజ్మీరి బేగం అనే ఇద్దరిని ఇంట్లోనే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న వెంటనే మీర్ చౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు అదిల్ ఖాన్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.











