విచారణ నిమిత్తం తరలించిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ట్రాఫిక్ జామ్‌ను అదనుగా చేసుకుని వాహనం నుంచి దూకి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఖైదీలను మరో కేసులో పీటీ వారెంట్‌పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ పూర్తయిన తర్వాత వారిని తిరిగి జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం ఆగిన సమయంలో, ఖైదీ నరేష్ అనే వ్యక్తి వాహనం నుంచి దూకి అక్కడి నుంచి పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటన చంచల్‌గూడ జైలు సమీపంలోనే జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు ఖైదీలను ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 12న ఈ ముగ్గురు దొంగతనం కేసులో రిమాండ్‌కు వెళ్లారు.
పరారైన నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం లేదా ఇతర కోణాలపై విచారణ జరుగుతోంది.











