ముదిరాజ్ జిల్లా నాయకుడు ఇమ్మడిగోపి ముదిరాజ్ హత్య రాజకీయ ప్రేరేపితమని, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. లింగంపల్లి రోడ్డులో నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాజకీయంగా ఎదుగుతున్న ఇమ్మడి గోపీ ముదిరాజ్పై గత కొన్నేళ్లుగా హత్యాయత్నాలు జరుగుతున్నాయని బాలకిషన్ ముదిరాజ్ తెలిపారు. ఈ సంఘటన రాజకీయ కుట్రలకు బలైన ముదిరాజ్ కుటుంబానికి పోలీసుల రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
ఈ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని గన్నారం రాజేందర్ ముదిరాజ్, సర్పంచ్ రఘు ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, ఇదల్వై గంగాధర్ ముదిరాజ్, సంతోష్ ముదిరాజ్, గొల్లపల్లి అంజయ్య ముదిరాజ్ తదితరులు డిమాండ్ చేశారు.
ఇమ్మడిగోపి ముదిరాజ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు.

