కామారెడ్డి జిల్లా 26వ వార్డులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. 26వ వార్డు కంటెస్టెంట్ కౌన్సిలర్ శ్రీమతి మానేకర్ సరిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లో మరింత బలపడాలని కోరుకుంటూ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా, జనసేన పార్టీ ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తుందని మానేకర్ సరిత తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ POC మెంబర్ ప్రసాద్, పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని మానేకర్ సరిత పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లే బాధ్యత అందరిపైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి అందరూ కృషి చేయాలని ఆమె సూచించారు.












