కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్న దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, పలు దుకాణాలను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభించారు.
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతురావు ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. దాడుల్లో భాగంగా, లైసెన్సులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు గుర్తించిన దుకాణాలను అధికారులు సీజ్ చేశారు.
ఎక్సైజ్ ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి అక్రమ వ్యాపారాలపై దాడులు కొనసాగుతాయని తెలిపారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ వ్యాపారాలపై నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.












