బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కేటీ రామారావు, టి. హరీశ్ రావు బుధవారం ఎర్రవల్లి ఫాంహౌస్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరిక వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ప్లీనరీ లేదా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఈ సమావేశాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే అవకాశాలపై కేసీఆర్తో చర్చించారు. ఈ విషయాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు కేసీఆర్తో భేటీ అనంతరం, జీవన్ రెడ్డిని కేటీఆర్ కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారని, ఆ తర్వాత కేసీఆర్తో జీవన్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చించారు. హరీశ్ రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేయనుంది.











