కూకట్పల్లి నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతిని పురస్కరించుకుని పలుచోట్ల ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీలో నూతన విగ్రహావిష్కరణతో పాటు, వివిధ డివిజన్లలో నివాళులర్పించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు విస్తృతంగా జరిగాయి. ఈ సందర్భంగా పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ నాయకుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ నూతన విగ్రహాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
బండి రమేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ ను ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయరాదని, ఆయన దేశానికి చేసిన సేవలు, రచించిన రాజ్యాంగం ప్రపంచానికి మార్గదర్శకమని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన విశాల దృక్పథంతో పనిచేశారని తెలిపారు.
నియోజకవర్గంలోని అల్లాపూర్, బాలనగర్, వై జంక్షన్, ఓల్డ్ బోయిన్పల్లి, దయార్గూడ వంటి పలు డివిజన్లలో స్థానిక నాయకులతో కలిసి బండి రమేష్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







