కామారెడ్డి, జూలై 17
మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి, మండల అభివృద్ధి, ప్రజల సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నూతనంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాచారెడ్డి గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డిని షబ్బీర్ అలీ అభినందించారు.
మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డిని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మండలంలోని సర్పంచులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై షబ్బీర్ అలీ అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ఓర్పుగా విన్న ఆయన సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నౌసిలాల్, సర్పంచులు కేతావత్ కాంలు, కేలోత్ పద్మస్వామి, మాలోత్ వసంత-శివాలాల్, మాలోత్ సంతోష్, బానోత్ శ్రీరామ్, మాలోత్ రుక్కి చంద్రునాయక్, భూక్యా రాజవ్వ, మరుపాక అంజమ్మ-లక్ష్మీరాజం, లావణ్య-రాజకుమార్, అనిల్, బన్నీ, లక్ష్మి-మల్లారెడ్డి, మమత-రమేష్ రెడ్డి, సునీత-శంకర్, శిల రవికుమార్, మాన్సింగ్, సదర్, శ్రీనివాస్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.











