యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్ పై మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఆరోపణలపై కేసు నమోదు అయింది.
పోలీసుల వివరాల ప్రకారం, అనిల్ కుమార్ గౌడ్ ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన మైనర్ బాలికను రహస్యంగా అర్ధరాత్రి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధిక కట్నం ఆశతో మైనర్ బాలికలను వివాహం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు, అనిల్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.











