Jangaon/Ghanpur (Station) (ప్రశ్న ఆయుధం) జూలై 30
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 11 మంది అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లకు (ఏఎస్సై) సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై) హోదాకు పదోన్నతి లభించింది. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు పదోన్నతి పొందిన అధికారులు గురువారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎన్నాళ్లుగానో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు అవకాశం లభించడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన అధికారులను అభినందించి, కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
బి. జాన్సన్ (మహిళా పోలీస్ స్టేషన్, నిజామాబాద్), జి. రాజేశ్వరరెడ్డి (వేల్పూర్ పోలీస్ స్టేషన్), వి. అనిల్‌కుమార్ (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), శ్రీనివాస్‌రెడ్డి (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), బి. సాయిలు (టౌన్-2 పోలీస్ స్టేషన్), ఎం.డి. లాయక్ అలీ (టౌన్-4 పోలీస్ స్టేషన్), డి. చిన్న గంగారం (టౌన్-1 పోలీస్ స్టేషన్), ఎస్.కె. గఫూర్ (నవీపేట్ పోలీస్ స్టేషన్), కె. బాబురావు (బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్), పి. శంకర్ (జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్), రేణుకాదేవి (రుద్రూర్ పోలీస్ స్టేషన్).