కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బైరెడ్డి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, పాడి రైతులు తమ పశువులకు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.
సర్పంచ్ బైరెడ్డి వెంకటరమణారెడ్డి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఉచిత టీకాలు పశువుల ఆరోగ్యాన్ని కాపాడతాయని ఆయన తెలిపారు.
మంగళవారం రోజున గ్రామంలో 145కి పైగా పశువులకు టీకాలు వేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ విజేందర్ రావు, తిరుపతి jvo రవీందర్, LSA కనకయ్య, ప్రేమ్ కుమార్, గోపాల మిత్రులు కోడం శ్రీనివాస్, నవీన్, చిరంజీవి, తిరుపతి, మహేందర్, సాయి తేజ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.










