దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కూకట్పల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కెపిహెచ్బి కాలనీ, మలేషియా టౌన్షిప్ సర్కిల్, బాలనగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆయన స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. దేశంలో ఐటి రంగంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేశాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన ఎల్లప్పుడూ పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగానే కొనసాగుతుందని, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










