రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన రెడ్డి సంఘాల ఐక్యవేదిక సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మూడోసారి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.
గత 12 సంవత్సరాలుగా రెడ్డి సామాజిక వర్గ అభ్యున్నతి, సంక్షేమం లక్ష్యంగా ఐక్యవేదిక పలు కార్యక్రమాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వారు పేర్కొన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా పేద కుటుంబాలు, నిరుద్యోగ యువతీ యువకుల సంక్షేమం కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని చెప్పారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని నిరంతరం డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
తనపై నమ్మకం ఉంచి మరోసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నాగర్త చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సందీప్ తిరుపతిరెడ్డి, సహాధ్యక్షులు నాగిరెడ్డి లింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుమన్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, రాజ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










